ముగించు

కురుమూర్తి శ్రీవేంకటేశ్వర దేవస్థానం

కురుముర్తి తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన చిన్నచింతకుంట నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 39 కి. మీ. దూరంలోనూ ఉంది.మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో కురుమూర్తి ఉంది.
తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో పోలికలున్న కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం క్రీ.శ.14 వ శతాబ్దానికి చెందినది. ఇది చిన్న చింతకుంట మండలంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరడానికి రైలుమార్గం కూడా ఉంది.