ముగించు

కోయిలకొండ ఫోర్ట్, కోయిలకొండ గ్రామమం మరియు మండలము

కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సిరస్సులు, ధాన్యారాగాలు, దేవాలయాలు, రెండు పెద్ద పిరంగులతో పాటు కోట చుట్టూ గల కొండలపై అలనాడే మహిమ గల దేవాలయాల నిర్మించారు. కోటకు పడమటి భాగాన రామగిరి అని నాడు రామకొండ అని నేడు పిలిచే ఎత్తైన కొండపై శ్రీ రాముని పాదములు ఉంది. ఆ కొండపై సైతం లెక్కలెనన్ని గృహాలు ఉన్నాయి. పూర్వ కాలంలో మునులు, ఋషులు సంవత్సరాల తరబడి తపస్సు చేశారని పెద్దల వాక్కు, ఈ కొండపై విశేష వన మూలికలు ఉన్నాయి. అక్కడ గల సిరస్సులోని నీళ్ళతో స్నానం చేసి ఆ నీరును తాగి రాముని పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు అన్ని ఇట్టే నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. కోటకు దక్షిణాన పెద్దవాగు ఉంది. దాన్ని పక్కనే ధర్మరాజుల బండ ఉంది. ఇక్కడికి పంచపాండవులు సైతం తమ అరణ్యవాసంలో వచ్చి ఉండొచ్చని పూర్వీకులు అంటారు. కోటకు తూర్పభాగాన ఎత్తైన కొండపై వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి మనహారాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వారు సంవత్సరం పొడవున వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.