ముగించు

కోయిల్ సాగర్ ప్రాజెక్ట్

కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలోని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి. జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. మండల కేంద్రమైన దేవరకద్రకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. జిల్లాలోని దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలలోని 12 వేల ఎకరాల సాగు భూమికి నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశింపబడింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.276TMC లు. 1945లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. రెండు కొండల మధ్య నిర్మించబడిన ఈ ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేయడానికి పనులు ప్రారంభమైనవి.

50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు.