ముగించు

శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం, మన్యంకొండ

మన్యంకొండ దేవాలయం : మహబూబ్ నగర్ జిల్లా లోనే అతిపెద్ద దేవాలయం మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎత్తయిన కొండపై మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు మార్గంలో కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర జర్గుతుంది. కొండపై ఉన్న ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను ఆకట్టుకొంటుంది.

మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమిటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రము. పేదల తిరుపతిగా పేరిపొందిన[1] మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మార్గము నుండి 4 కిమీ లోపలికి ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఎత్తయిన కొండపై, ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నాడు. మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సి చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేవస్థానం దేవాదాయ శాఖ అధీనంలో ఉంది.