ముగించు

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, కందూరు

ఆలయ చరిత్ర: పూర్వము తంబళి వంశానికి చెందిన ఒక మహిళ గట్టుమీద వెలసిన రామలింగేశ్వరుని ప్రతి దినము దర్శించుకోవటానికి వెళ్ళేది. ఆమె కాలక్రమేణ గర్భవతి కావడం రానురాను ఆమె నిండుచూలాలు కావడంతో శ్రీ స్వామి వారిని ప్రతిదినము దర్శించుకోవడం చేతకకపోవడంతో శ్రీ స్వామి వారిని వేడుకుంది. ఓ స్వామి నేను గుట్ట ఎక్కి ప్రతి దినము నిను దర్శించుకోవడం నా చేతకాదు మళ్లీ ఎంతకాలానికి మిమ్మల్ని సేవించుకుంటానో అని బాధతో స్వామి వారిని వేడుకుంది. ఆ మాటలు విన్న రామలింగేశ్వరుడు వెంటనే ఆమె భక్తికి పారవష్యుడై (ప్రత్యక్షమై) ఆమెతో ఇట్లు అనెను. నీవు రాలేకుంటే నేను నేను నీవెంబడి వస్తాను అని చెప్పినాడు. ఆమె వెంబడి రథారూడుడై బయలుదేరినాడు. కొంత దూరము దిగిన పిమ్మట భయంకరమైన గంటల మరియు రథ చక్రాల శబ్దానికి భయపడి ఆమె తిరిగి వెనుకకు చూడడంతో రథ చక్రాలు విరిగి ఒకటి కోనేరులో పడిపోయింది. రెండవది లింగాకృతి దాల్చిన రామలింగేశ్వరునికి పీటంగా ఏర్పడింది. ప్రస్తుతము శ్రీ స్వామి వారికి పానవట్టము లేదు. రథచక్రమే పానవట్టముగా మారింది.