కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి .
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కి 15 కి మీ దూరం లో గూడెబల్లూరు గ్రామం లో వెలసిన ప్రసిద్ద స్వయం భు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురతనమైన దేవాలయం . మాండవ్య మహర్షి కోరిక తీర్చడానికి స్వయం గ వెంకటేశ్వర స్వామి, లక్ష్మి దేవి ఈ గుట్ట పైకి వచ్చి మహర్షి కోరిక నెరవేర్చారు అని స్థల పురాణం.
పూర్వం ఈ ప్రాంతాన్ని గుండిలపురం అని పిలువబడేది .చైత్రమాసం లో ఇక్కడ 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మన రాష్ట్రము నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాల మంది బక్తులు ఇక్కడికి వస్తు ఉంటారు . చాల మహిమన్మితమైన క్షేత్రం ఇది .