ముగించు

PRESS NOTES

Drone Camera:

Press note:

పత్రికా ప్రకటన     మహబూబ్ నగర్
27 .12. 2021
___________
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వీడియోలు,ఫోటో ల చిత్రీకరణకు అద్దె పై డ్రోన్ కెమెరా సరఫరా చేసేందుకు గాను ఆసక్తి ఉన్నవారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి యు.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం, వ్యవసాయం, ఉద్యాన, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ , తదితర శాఖ ల ద్వారా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలతో పాటు, ప్రముఖుల జిల్లా సందర్శన సందర్బంగా  వీడియోలు,ఫోటోలు చిత్రీకరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో జిల్లా టూరిజం అధికారి పెరు పై తీసిన 100 రూపాయల డిమాండ్  డ్రాఫ్ట్ తో సహా  జనవరి 3, 2022 లోగా సమర్పించాలని తెలిపారు.  అయితే దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యక్రమాల చిత్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవలసి ఉంటుందని, ఆ ప్రకారమే డ్రోన్ ద్వారా వీడియోలు,ఫొటోలు చిత్రీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు దారులు డ్రోన్ ద్వారా చిత్రీకరించినందుకు గాను తీసుకొనే చార్జి ల మొత్తాన్ని స్పష్టంగా దరఖాస్తులో  పేర్కొనాలని, ముఖ్యంగా 2 గంటల సమయానికి, 6 గంటల సమయానికి, ఒక రోజుకు ఎంత అద్దె ఛార్జ్ చేస్తారో స్పష్టంగా దరఖాస్తులో  పేర్కొంటూ దరఖాస్తు సమర్పించాలని ఆయన తెలిపారు.  దరఖాస్తు నమూనా,ఇతర పూర్తి వివరాలకు జిల్లా వెబ్ సైట్  https://mahabubnagar.telangana.gov.in/ ను సంప్రదించాలని లేదా  ఫోన్ నెంబర్ 9949351689 ద్వారా కూడా సంప్రదించవచ్చని ఆయన వెల్లడించారు.
____________ జారీ చేసినారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, మహబూబ్ నగర్*

 

 

Application form:  Application for Drone Camera