ముగించు

రైతు బందు పథకం

తేది : 01/06/2018 - | రంగం: వ్యవసాయ
 రైతు బంధు పథకం  :
పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి తెలంగాణ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది.
రైతు బంధు సంక్షేమ పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగు పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించా నుంది.
రైతు బంధు సంక్షేమ పథకం ఆర్థిక సహాయం

రైతు బంధు సంక్షేమ పథకం

లబ్ధిదారులు:

రైతులు

ప్రయోజనాలు:

పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, రైతు బంధు సంక్షేమ పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగు పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించా నుంది.