ముగించు

సి.పి.ఓ

ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయము విధులు:

వ్యవసాయ గణాంకములు :

 వర్షపాతం:

  • ప్రతి మండల కేంద్రములో వర్షపాతమును రోజూ ఉదయం 8.30 నిమిషములకు డిప్యూటీ తహసీల్దార్ గారిచే నమోదు చేయబడుతుంది.
  • నమోదు చేయబడిన వర్షపాత వివరములను మండలములోని మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి సంబధిత రాజస్వ మండలాధికారి గారికి మరియు జిల్లా ముఖ్యప్రణాళికాధికారి గారికి తెలియచేస్తారు.
  • జిల్లాలో ప్రతిరోజూ వర్షపాతమునకు సంబంధించిన విశ్లేషణ చేసి అట్టి వివరములు సంచాలకులు, అర్ధగణాoక శాఖ కార్యాలయమునకు మరియు ఇతర అధికారులకు క్రమము తప్పకుండా పంపిస్తారు.

తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటి:

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటి ద్వారా నిర్ణీత ప్రదేశములలో ఏర్పాటు చేయబడిన స్వయంచాలిత వాతావరణ కేంద్రముల ద్వారా ప్రతి గంటకు జి. ఎస్. యం. సాంకేతిక పరిజ్ఞానముతో వర్షపాత సేకరణ, గాలి వేగము, గాలి దిశ, పీడనం, వాతావరణములో తేమ మరియు ఉష్ణోగ్రత ఇవేకాకుండా గ్లోబల్ రేడియేషన్ మరియు నేలలో తేమ సంక్షిప్త సమాచార రూపములో సేకరిస్తారు.
ఇట్టి సమాచారమును సంబoధిత శాఖలు ప్రభుత్వ పథకములను అమలుచేయుటకు, ప్రణాళికలు రూపొందించుటకు ఉపయోగించడం జరుగుతుంది మరియు భారతీయ వ్యవసాయ బీమా కంపెని ఎంపిక చేయబడిన పంటలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము అమలుచేయుటకు ఉపయోగిస్తున్నారు.

వాతావరణ పరిస్థితుల నివేదిక:

మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి ప్రతి బుధవారం మండలమునకు సంబంధించి వర్షపాతము, పంటల వివరములు, పంటల పరిస్థితి, నీటి లభ్యత వివరములు, ప్రజారోగ్య పరిస్థితులు, పశువుల పరిస్థితి మరియు పశుగ్రాస లభ్యత వివరముల నివేదికను జిల్లా ముఖ్యప్రణాళికాధికారి కార్యాలయమునకు పంపిస్తారు.

పంటల విస్తీర్ణం నివేదిక:

పంటల విస్తీర్ణం నివేదికలను ఆహార మరియు ఆహారేతర పంటలకు వ్యవసాయ గణన ద్వార ఖరీఫ్ మరియు రబీకి సంబంధించి రెండు పర్యాయములు తయారుచేస్తారు. ఈ పంటల విస్తీర్ణ వివరముల సమాచారమును ఉపయోగించి క్షేత్ర స్థాయిలో రైతులు విక్రయించే పంట ధరలను ఎంపిక చేయబడిన మండలముల నుండి సేకరించడం జరుగుతుంది.

నిర్ణీత కాల వ్యవసాయ గణన:

నిర్ణీత కాల వ్యవసాయ గణన పథకం క్రింద ప్రతి సంవత్సరం ప్రతి మండలములో 20% గ్రామాలను ఎంపికచేసి, ఎంపిక చేసిన గ్రామముల వివరములను మండలములకు పంపిస్తారు. ఈ ఎంపిక కాబడిన గ్రామాలలో విత్తబడిన అన్నిపంటల వివరములను(ప్రస్తుత మరియు గత సంవత్సరములకు సంభందించినవి) గ్రామ పాలనాధికారి పహాణిల ద్వార సేకరించి కరిఫ్ సీజన్లో రెండు కార్డులు మరియు రభి సీజన్లో రెండు కార్డులలో నింపి ముఖ్యప్రణాళికాధికారి కార్యాలయమునకు సమర్పిస్తారు.అట్టి సమర్పించిన వివరములను సంచాలకులు,అర్ధ గణాంక శాఖకు పంపించబడుతాయి.

సాధారణ పంటల అంచనా నివేదికలు:

ఈ అంచనా నివేదికల ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా హెక్టారుకు సగటు దిగుబడి మరియు ముఖ్యమైన పైర్ల క్రింద జిల్లాలో ఎంత పంట ఉత్పతి ఉన్నదో తెలుసుకొనవచ్చు. గత సంవత్సరంలో పంట విస్తీర్ణమును బట్టి ఈ సంవత్సరంలో ఎన్ని పంటకోత ప్రయోగాలు చేయాలో నిర్ణయించబడుతుంది. ప్రతి మండలంలో నిర్ణీత కాల వ్యవసాయ గణన పథకము క్రింద ప్రస్తుత సంవత్సరములో ఎంపిక చేసిన గ్రామాలలో ఆహార మరియు ఆహారేతర పంటకోత ప్రయోగాలు నిర్వహించబడును.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ( పి ఎం ప్ బి వై ):

రైతుల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వo ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశ పెట్టినది. ఇందులో జిల్లాలోని ముఖ్యమైన పంటను సీజన్ వారిగా ఎంపిక చేసి గ్రామము యూనిట్ గా భీమా సౌకర్యము కల్పించబడుతుంది. మరియు మిగతా పంటలకు మండలము మరియు జిల్లా యూనిట్ గా తీసుకొని భీమా సౌకర్యం కల్పించబడుతుంది.

ధరల సేకరణ:

ధరల సేకరణలో భాగంగా మండల ప్రణాళిక మరియు గణాంకాధికారులు ఎంపికచేయబడిన మండలములలో దినసరి, వారాంతపు మరియు మాస నివేదికలను తయారుచేసి జిల్లా కార్యలయం కు అందిస్తారు.
రాష్ట్ర స్థూల ఆదాయమునునిర్ణయించడంలోధరల సేకరణ ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగపడుతుంది.
ధరలు వివిధ రకాలుగా అనగా అ)నిత్యావసర వస్తువుల ధరలు ఆ) వ్యవసాయ ఉత్పత్తి ధరలు ఇ) వ్యవసాయ మరియు వ్యవసాయేతర కూలీల వేతనములు ఈ) పశువుల మరియు పశువుల ఉత్పత్తి టోకు ధరలు ఉ) భవన నిర్మాణ సామాగ్రి ధరలు సేకరించడం జరుగుతుంది.

పరిశ్రమల గణాంకాలు:

వార్షిక పరిశ్రమల సర్వే(ఏ.స్.ఐ): పారిశ్రామిక రంగం లో గణాంకాల సేకరణకు ప్రతి సంవత్సరం నిర్వహించే పరిశ్రమల సర్వే ఒక ముఖ్యమైన వనరుగా ఉన్నది.
1948 చట్టం క్రింద గుర్తించబడిన పరిశ్రమలలో ఎంపిక చేయబడిన పరిశ్రమలకు సంబంధిoచి వార్షిక లెక్కల సర్వే చేయబడుతుంది.
రాష్ట్ర స్థూల ఆదాయాన్నిగణించడంలో వార్షిక పరిశ్రమల సర్వే వివరములు ఉపయోగిస్తారు.

పారిశ్రామిక ఉత్పత్తుల సూచిక(ఐ.ఐ.పి):

వార్షిక పరిశ్రమల సర్వే(ఏ.స్.ఐ) లో వున్న పరిశ్రమల సమాచారము గుర్తించడం లో ఆలస్యాన్ని నివారించేందుకు, పారిశ్రామిక ఉత్పత్తుల సూచిక(ఐ.ఐ.పి) ప్రవేశపెట్టి మాసము వారిగా కొన్నిముఖ్య పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తుల సూచిక వివరాలు సేకరిస్తారు.
వివిధ ప్రభుత్వ శాఖలలో, బ్యాంకి౦గ్ మరియు కార్పోరేట్ రంగంలలో పాలనాపరమైన నిర్ణయం తీసుకునే విధానం లో పారిశ్రామిక ఉత్పత్తుల సూచిక(ఐ.ఐ.పి) ఉపయోగపడుతుంది.

వ్యాపార సంస్థల వివరములు నమోదు(బి.ర్):

ఏడురకాల చట్టముల క్రింద నమోదు చేయబడి స్థాపించబడిన వ్యాపార సంస్థల వివరములు ఇoదులో సేకరిస్తారు.

ఇతర గణాంకాలు:

స్థానిక ప్రాంత ప్రణాళిక గణన(యస్.ల్.ఎ.పి): స్థానిక ప్రాంత ప్రణాళిక గణన గ్రామీణ ప్రాంతాలలోని మండలములలో గల అన్ని గ్రామములవారిగా మరియు పట్టణ ప్రాంతలలో మున్సిపాలిటీలు/నగరపంచాయతిలలోని వార్దుల వారిగా సమాచారము సేకరించబడుతుంది.తద్వారా ఆయా ప్రాంతముల మౌళిక సదుపాయాల వివరాలు తెలుస్తాయి.
జిల్లా గణాంక దర్శిని: ప్రతి సంవత్సరం వివిధ శాఖల ద్వార జిల్లా పూర్తి సమాచారము సేకరించి జిల్లా గణాంక దర్శిని ముద్రించబడుతుంది.
నిర్ణిత సమయ(అడాక్) గణన: ప్రతి ఐదు సంవత్సరాలకు వ్యవసాయ కమతముల గణన , చిన్న నీటిపారుదల గణన మరియు ఆర్దిక గణన చేయబడుతుంది. వీటి వలన రైతుల కమతముల వివరములు,నీటి వనరుల సంఖ్య మరియు ఆర్ధిక సంస్థల వివరములు తెలుస్తాయి.
సాంఘిక ఆర్ధిక గణన (యస్.ఇ.యస్): శాస్త్రీయ పద్దతుల ద్వార దేశములోని ప్రజల యొక్క సాంఘిక మరియు ఆర్ధిక వివరములు తెలుసుకొనుటకు 1950 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వo,నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజెషన్ స్థాపించినది. ప్రతి సంవత్సరం వివిధ అంశములపై ఇట్టి సర్వే నిర్వహించబడును.
మన రాష్టములో ఎన్ ఎస్ ఎస్ ఓ వారు ఎంపిక చేసిన గ్రామాలలో అర్ధ గణాంక సిబ్బంది ఇట్టి సర్వే నిర్వహిస్తారు.
ఇట్టి శాంపిల్ సర్వేల ద్వార అసంగిటిత రంగంలో పని చేయుచున్న కార్మిక శక్తి అంచనా నిష్పత్తి,నిరుద్యోగ నిష్పత్తి, నెలవారీ తలసరి వినియోగ వ్యయం(యం.పి.సి.ఇ) మరియు కార్మికుల యొక్క స్థూల విలువ ( జి వి ఏ పర్ కార్మికుడు)కి సంభoదించిన సమాచారము సేకరించబడుతుంది.పై గణనలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి మరియు జిల్లా స్థూల ఉత్పత్తి నిర్ణయించడం లో ఉపయోగపడుతుంది.

జిల్లా జ్ఞాన ఆవిష్కృత కేంద్రం(డి.కే.ఐ.సి):

తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (ట్రాక్):

తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ ఒక స్వయంప్రతిపత్తి సంస్థ మరియు ప్రణాళిక శాఖ కు అనుబంధ సంస్థ గా పనిచేస్తుంది. రిమోట్ సెన్సింగ్( ఆర్ ఎస్ ), జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(జి ఐ ఎస్ ) & గ్లోబల్ పోసిషన్ సిస్టమ్స్(జి పి ఎస్ ) సేవలు తెలంగాణ రాష్టానికి అందించడానికి ఇది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. వెబ్సైటు: http://tracgis.telangana.gov.in.

ఆస్తుల గుర్తింపు ప్రాజెక్ట్:

ప్రతి అవాసములో కల ఆస్తులను గుర్తించడం ద్వార కావలసిన సౌకర్యాలు కల్పించు ఉద్దేశ్యంతో ఇట్టి ప్రాజెక్ట్ ప్రారంబించబడినది.
సూక్ష్మ ప్రణాళిక మరియు అబివృద్ది లో ఆస్తుల గుర్తింపు ముఖ్య భూమిక. తెలంగాణ లో పది(పాత) జిల్లలో ఆస్తుల గుర్తింపు శాంపిల్ ప్రాజెక్ట్ కు మహబూబ్ నగర్ జిల్లా ఎంపిక చేయబడింది.
ఆస్తుల గుర్తింపు ప్రాజెక్ట్ భువన్ పంచాయితీ మొబైల్ అప్లికేషను ద్వారా చేయబడుతుంది. గ్రామాల అబివృద్ది ప్రణాళిక తయారు చేయుటలో ఉపయోగపడుతుంది. ఆస్తుల గుర్తింపు ఆండ్రాయిడ్ మొబైల్ అప్ (భువన్ పంచాయత్ అప్) జి.పి.యస్ ద్వార భూభాగంలో ఆస్తుల యొక్క పోసిషన్ మరియు చిత్రం తీయబడుతుంది మరియు కేంద్ర సర్వర్ కు చేరవేయబడుతుంది.
మహబుబ్ నగర్ జిల్లాలో ఇరవైఅరు మండలాలో గల ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ప్రణాళిక శాఖ మరియు పంచాయత్ సెక్రటరీ ల ఆద్వార్యంలో ప్రతి గ్రామంలో పూర్తిగా ఆస్తుల ను గుర్తించడం జరిగింది.

ప్రణాళిక విభాగం:

నియోజక వర్గ అబివృద్ది ప్రణాళిక(సి.డి.పి):గౌరవనియులైన శాసన సభ్యలు మరియు శాసన మండలి సభ్యల యొక్క సిఫారసుల మేరకు ప్రతి నియోజక వర్గమునకు సంవత్సరానికి కేటాయించిన మూడు కోట్లరూపాయల అబివృద్ది పనులను పర్యవేక్షించడం జరుగుతుంది.
పార్లమెంటు సభ్యల స్థానిక ప్రాంతాల అబివృద్ది నిధుల పథకం(యం.పి.లాడ్స్): పార్లమెంటు సభ్యల యొక్క సిఫారసుల మేరకు పార్లమెంటు నియోజక వర్గములో సంవత్సరానికి కేటాయించిన ఐదు కోట్లరూపాయల అబివృద్ది పనులను పర్యవేక్షించడం జరుగుతుంది .
ప్రత్యేక అభివృద్ది నిధి(యస్.డి.యఫ్): జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిఫారసుల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆసెంబ్లీ నియోజక వర్గాల అబివృద్ది కొరకు ఐదు కోట్ల రూపాయల విలువైన పనులను కేటాయించడం జరుగుతుంది మరియు గౌరవ ప్రజా ప్రతి నిధులు (ఏం పి , ఏం ఎల్ ఏ ,ఏం ఎల్ సి ) సిఫారసుల మేరకు ప్రత్యేక అబివృద్ది నిధి నుండి మంజూరు చేయబడుతుంది ప్రభుత్వ ఆమోదం లబించిన తరువాత జిల్లలోనీ కార్యనిర్వహణ సంస్థలకు పనులు చేయుటకు అప్పగించబడుతుంది.
క్రూషియల్ బాలెన్సింగ్ ఫండ్ (సి.బి.యఫ్): ప్రజల యొక్క తక్షణ అవరసరాలను తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వం క్రూషియల్ బాలెన్సింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయటం జరిగినది. ఇట్టి నిధులు జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో మంజూరు చేయబడుతాయి.

చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ మొబైల్ నంబర్లు (పి.డి.ఎఫ్ 78.6 కె.బి)