ముగించు

గిరిజన అభివృద్ధి

జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ : : మహబూబ్ నగర్

వసతి గృహముల నిర్వహణ :

ఈ జిల్లాలో (05) గిరిజన సంక్షేమ వసతి గృహములు, (1) గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహించబడుచున్నవి. అందులో (1366) మంది బాల బాలికలు కలరు. అందులో ( 05 ) ప్రభుత్వ భవనములు ( 01 ) అద్దె భవనములు కలవు.

3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు రూ. 950=00 మరియు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు రూ. 1100=00 ల ప్రకారము మరియు మెనూ ప్రకారము విద్యార్థులకు భోజన వసతి కల్పించడము జరుగుచున్నది. ఉచితముగా (04) జతల బట్టలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ ప్లేట్లు, గ్లాసులు, కాటార, ట్రంక్ పెట్టెలు మరియు సబ్బులు బాలురకు రూపాయలు 62/- బాలికలకు రూపాయలు 90/-ల చొప్పున ప్రతి మాసము చెల్లించబడు చున్నవి. ప్రతి వసతి గృహములో 8,9,10వ తరగతి విద్యార్థులకు (04) గురి చోప్పున ట్యూటర్లను నియమించి ప్రత్యేక బోదన నిర్వహించడము జరుగుతున్నది. బాలురకు రూ.12/- హెయిర్ కటింగ్ కొరకు ఇవ్వబడుచున్నవి .

కే.సి.ఆర్ కిట్ :

గిరిజన వసతి గృహములలో చదివే బాల, బాలికలకు కే.సి.ఆర్ కిట్ గిరిజన కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ,మన్ననూర్ నుండి ఈ క్రింది వస్తువులను ఇవ్వబడుచున్నవి.

క్ర.సం వస్తువుపేరు బాలికలు బాలురు
1 సంతూర్ సబ్బులు 5 5
2 XXX బట్టల సబ్బులు 5 5
3 సంతూర్ పేస్ పౌడర్ డబ్బలు 2 2
4 క్లోజ్ అప్ టూత్ పేస్ట్ 50 గ్రాములు 3 0
5 కోల్గేట్ టూత్ పేస్ట్ 50 గ్రాములు 0 2
6 కొబ్బరి నూనె డబ్బలు 2 1
7 దువ్వెన 1 1
8 టూత్ బ్రష్ 1 1
9 నాప్కిన్స్ పాకెట్స్ (10పీస్లు) 2 0
10 రిబ్బన్లు 2 0

 

10 తరగతి ఉత్తీర్ణత:-

2016-17 విద్య సం.లో (148) మంది వసతి గృహవిద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా అందులో (143) మంది విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత అయినారు. ఉత్తీర్ణత శాతం 96.62%.

సంవత్సరం హాజరైన విద్యార్ధులు పాసైన విద్యార్థులు శాతము

2016-17 148 143 96.62 %

కళాశాల వసతి గృహములు:-

జిల్లాలో మొత్తము (03) కళాశాల వసతి గృహములు గలవు. అందులో (01) ప్రభుత్వ భవనము
(02) అద్దె భవనములలో నిర్వహించబడుచున్నవి. అందులో బాలికల వసతి గృహము, మహబూబ్ నగర్లో (106) మంది, బాలికల వసతి గృహము , జడ్చెర్ల లో ( 50) , బాలుర వసతి గృహము, మహబూబ్ నగర్లో (200) మంది, మొత్తం (356) మంది కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు వసతి కల్పించనైనది.

పోస్టు మెట్రిక్ ఉపకార వేతనములు:-

2016-17 విద్యా సంవత్సరమునకు, కమీషనరు, గి. సం., తెలంగాణ, హైదరాబాద్ గారు (182) కళాశాలలలో మెట్రిక్ అనంతరము విధ్యనభ్యసించే (3903) మంది విద్యార్థిని, విద్యార్థులకు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనములు మంజురుచేయనైనది.

 

క్ర.సo. స్కీము కమీషనర్, హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్జెట్ రూ. లక్షలలో ఖర్చు శాతము
1 MTF 218.78 218.64 99.93%
2 RTF 507.15 436.32 86.03%

 

అంబేద్కర్ ఓవరసీస్ విద్యానిధి :-

విదేశాలలో విద్యనభ్యసించే గిరిజన విద్యార్థులకు, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయము రూ.1,50,000=00 ( గ్రామీణ ప్రాంతమువారికి ) రూ.2,00,000=00 (పట్టణ ప్రాంతమువారికి ) ఈ పథకము ద్వారా . 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న గిరిజన విద్యార్థులు అర్హులు. 2016-17 విద్యా సంవత్సరమునకు అంబేద్కర్ ఓవరసీస్ విద్యానిధి పథకము ద్వార విదేశాలలో చదివే మన జిల్లా గిరిజన విద్యార్థుల కొరకు (70.00) లక్షలు విడుదల కాగా అందులో (3) విద్యార్థులకు 60.00 లక్షలు ఖర్చు చేయనైది. ఈ క్రింది దేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇవ్వడము జరుగుతుంది.

  1. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2. యు. కే. 3. కెనడా 4. సింగాపూర్ మరియు ఆస్ట్రేలియా.
క్ర.సo. స్కీము కమీషనర్, హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్జెట్ రూ. లక్షలలో ఖర్చు శాతము
1 ABON 100.00 70.00

 

70%

బెస్ట్ అవేలబుల్ స్కూల్ స్కీం ద్వార విద్య :-

ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రవేటు పాఠశాలల యందు ప్రతి సంవత్సరము ౩వ, 5వ, 8వ తరగతులలో లాటరీ పద్దతిలో ప్రవేశము కల్పించడము జరుగుతుంది. 2017-18 ఈ విద్య సంవత్సరమునకు గాను జిల్లాకు (33) సీట్లు కేటాయించడము జరిగింది. అట్టి సీట్లు నుండి (33) మంది గిరిజన బాల బాలికలచే భర్తీ చేయబడినవి. రు. 41.70 లక్షల నిధులు మంజూరు కాగా రు 41.07 లక్షల నిధులు (138 ) విద్యార్థులకు ఖర్చు చేయు నైనది.

క్ర.సo. స్కీము కమీషనర్, హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్జెట్ రూ. లక్షలలో ఖర్చు శాతము
1 BAS 41.70 41.07 98.50

ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు ;-

ప్రభుత్వ జిల్లా పరిషత్. మున్సిపల్ మరియు ఎయిడేడ్ పాఠశాలలలో చదువు చున్న గిరిజన బాల బాలికలకు ప్రోత్సాహకాలు అందించి వారిని తరగతి గదికి రప్పించుటకు వీలుగా ఈ పథకము ప్రవేశ పెట్టడము జరిగినది. 5 వ తరగతి నిండి 8 వ తరగతి వరకు నెలకు రూ.100=00 చొప్పున పది నెలలకు రూ.1000=00 బాలురకు మరియు రూ. 150=00 చొప్పున పది నెలలకు రూ.1500=00 బాలికలకు మంజూరు చేయబడును. 9 వ తరగతి నిండి 10 వ తరగతి నెలకు రూ.150=00 చొప్పున పది నెలలకు రూ.1500=00 చొప్పున డేస్కాలర్ మరియు పుస్తకాల కొరకు రూ. 750=00 సంవత్సరమునకు మంజూరు చేయబడును. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ. 350-00 మరియు పుస్తకాలకు రూ. 1000=00 సంవత్సరమునకు మంజూరు చేయబడును.

I.RVD :

క్ర.సం. సంవత్సరం కమీషనర్, హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్జెట్ రూ. లక్షలలో ఖర్చు శాతము
1 2014-15 to 2016-17 2.93 1.46 49.91

II. కొత్త పథకం:

క్ర.సం. సంవత్సరం కమీషనర్, హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్జెట్ రూ. లక్షలలో ఖర్చు శాతము
1 2014-15 to 2016-17 16.72 6.00 35.88

గురు సేవలాల్ జయంతి ఉత్సవాలు:-

2014 సంవత్సరములో ప్రభుత్వము ఈ పథకమును ప్రవేశపెట్టడము జరిగినది. సంతు సేవలాల్ మహారాజ్ గిరిజన (లంబాడి) ఆరాధ్య దైవమును స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫెబ్రవరి, 15వ తేదిన జయంతి ఉత్సవములు జరుపబడును. ఇట్టి పథకమునకు ప్రభుత్వము నుండి ప్రతి సంవత్సరము జిల్లా కలెక్టర్ గారికి విడుదల చేయబడును’. అట్టి డబ్బును గిరిజన సంఘాలు వారి వారి మండలములో సంతు సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించి అట్టి ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఈ కార్యాలయమునకు సమర్పించిన తదుపరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా డి.డిరూపములో చెల్లించబడును.

సంవత్సరం విడుదలైన బడ్జెట్ ఖర్చు

2016-17 5,44,000=00 4,29,750=00

2017-18 4,95,000=00 ( తేది 15.2.2018 రోజు సంతు సేవలాల్ మహారాజ్

జయంతి వేడుకలు నిర్వహించబడినవి)

ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్:-

గుడుంబా:

2016-17 సంవత్సరమునకు సార (గుడుంబా) నిషేదము క్రింద (220) మందికీ గాను. Rs.440.00 లక్షలు విడుదల చేయబడినది. ఇందులో (220) మందికి Rs. 407.50 లక్షలు మంజూరు చేయబడినది.

 

క్ర.సo. స్కీము కమీషనర్, హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్జెట్ రూ. లక్షలలో ఖర్చు శాతము
1 Gudumba 440.00 407.50 92.61

ట్రైకార్ క్రింద రుణాలు మంజూరు:

(2017-18) సంవత్సరమునకు ట్రైకార్ క్రింద లోన్లు మంజూరు చేయుటకు గాను ప్రణాళిక కమీషనర్, గిరిజన సంక్షేమము, తెలంగాణ, హైదరాబాద్ గారి నుండి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి , మహబుబ్ నగర్ గారికి వచ్చినది . సంబదిత మండల పరిషద్ అభివృద్ధి అధికారులకు 2017-18 ప్రణాళిక పంపనైనది . సంబదిత మండల పరిషద్ అభివృద్ధి అధికారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ఫారములు పంపబడుచున్నవి.

2017-18 సంవత్సరమునకు నిర్దేశించిన లక్ష్యము
మొత్తము ప్రతిపాదనలు</ th> సబ్సిడీ</ th> బ్యాంకు లోన్</ th> మంజూరు చేసిన మొత్తము</ th> </ th>
584 688.89 390.27 1143.36

YTC(యువకులకు ట్రైనింగ్ );

చదువుకున్న గిరిజన యువత ఆర్ధికంగా అభివృద్ధి చెందుటకు గాను యూత్ ట్రైనింగ్ సెంటర్ నడపబడుచున్నది క్రింద చూపబడిన కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వబడును. లోకల్ వారికీ రూ.350/- మరియు నాన్ లోకల్ వారికీ రూ. 1000/- ఉపకారవేతనము మంజూరు చేయబడును.

1.మొబైల్ రిపేర్ 2.కార్ డ్రైవింగ్ 3.ఫ్యాషన్ డిజైనింగ్ 4.స్టిచింగ్ డ్రెస్సెస్ 5.బ్యుటిషన్

డ్రైవర్ ఇమ్పవర్మెంట్ స్కీం:

లైసెన్సు , బ్యాడ్జి నెంబర్ కలిగివున్నా గిరిజన డ్రైవర్లలకు స్వంత కారు నడుపుటకు సబ్సిడితో కూడిన ఋణము మంజూరు చేసి ఉబెర్ కంపెనీకి అనుసందానము చేసి వారి ఆర్ధిక అభివృద్ధి చేయూత ఇవ్వబడును.

రూరల్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ స్కీం:

చదువుకున్న లైసెన్సు , బ్యాడ్జి నెంబర్ కలిగివున్నా గిరిజన డ్రైవర్లలకు స్వంత ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడుపుటకు సబ్సిడితో కూడిన ఋణము మంజూరు చేయబడును . 26 యూనిట్స్ మహబూబ్ నగర్ జిల్లాకు మజురుచెయనైనది .

TATA ACE, FORCE TRUMP, ASHOKA LEYLAND DOST, MAHINDRA MAXXIMO.

ల్యాండ్ డెవలప్మెంట్ స్కీం:

సగుచేయబడని వ్యవసాయ భూములను కలిగిన చిన్నకారు, సన్నకారు చెంచు రైతులకు నీటి పడుదల సౌకర్యము కల్పించి వ్యవసాయము చేయుటకు వీలుగా మార్చుటకు DPR తయారు చేసి ,కమీషనర్ ,గిరిజన సంక్షేమ అధికారి, హైదరాబాద్ గారి కార్యాలయమునకు అమోదమునకై పంపనైనది.

సి.సి.డి.పి రివాల్వింగ్ ఫండ్స్:

చెంచుల అబివృద్దికీ, ఆరోగ్యమునకు గాను హన్వాడ మండలము ,గుడిమల్కాపూర్ గ్రామానికి రూ. 20,00,000/- ప్రాజెక్ట్ ఆఫీసర్ ,మన్ననూర్ ద్వారా కలెక్టర్ గారికి మంజురుచేయనైనది .

 

స్టాఫ్ మొబైల్ నంబర్లు